BCCI:మెగా టోర్నీ ముసాయిదా షెడ్యూల్ విడుదల..!

48
- Advertisement -

చేజేతులా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ను వదులుకున్న భారత్‌. తాజాగా 2023వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ యేడాది ఆరంభంలో ఐపీఎల్ టెస్ట్ ఛాంపియన్ క్రికెట్ అభిమానులు అలరించాయి. అయితే తాజాగా మరోసారి క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐసీసీ సిద్ధమవుతుంది. వన్డే ప్రపంచకప్‌తో క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ను విడుదల చేశారు. అయితే ఈ షెడ్యూల్‌ను ఐసీసీతో పంచుకుంది. ఆతర్వాత మిగతా దేశాలకు ఈ షెడ్యూల్‌ను అందించనున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్‌ తీసుకున్న తర్వాత తుది షెడ్యూల్‌ను రూపొందిస్తారని అని ఓ జాతీయ క్రీడా ఛానల్‌ తెలిపింది.

Also Read: గొప్ప మనసు చాటుకున్న సెహ్వాగ్..

ఈ ముసాయిదా ప్రకారం అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌..రన్నరప్‌ జట్టు న్యూజిలాండ్ తలపడే మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ అక్టోబర్‌ 8న చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. మొత్తంగా 10టీమ్‌లు పాల్గొనే ఈ టోర్నీలో ఇప్పటికే 8జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా మరో జట్లు చేరతాయి. భారత్‌ తన లీగ్ మ్యాచ్‌లు 9నగరాల్లో ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌ పాక్‌ల మధ్య తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగనుంది.

Also Read: జోగులాంబ గద్వాలకు సీఎం కేసీఆర్..

- Advertisement -