టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాం కొలువుదీరింది. న్యూఢిల్లీలోని మ్యూజియంలో నిర్వాహకులు బుధవారం ఆవిష్కరించారు.
నా విగ్రహాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు నిర్వాహకుల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాని తెలిపారు విరాట్. నా జీవితంలో గుర్తుండిపోయే అనుభవాన్ని ఇచ్చారని…నాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమమకు రుణపడి ఉంటానని వెల్లడించాడు. ఈ మ్యూజియానికి వస్తున్న సందర్శకులు కోహ్లీ మైనపు విగ్రహం పక్కన సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.
ఈ మ్యూజియంలో ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌తో పాటు మెస్సీ (ఫుట్‌బాల్), ఉసేన్ బోల్ట్ (స్పింటర్) విగ్రహాలు కొలువుదీరగా తాజాగా విరాట్ కోహ్లి విగ్రహం కూడా చేరింది.
Presenting #TussaudsDelhi's next big unveil! The run machine, the chase master, @imVkohli is here! #KohliInDelhi pic.twitter.com/TokyEVePSp
— Madame Tussauds India (@Tussaudsind) June 6, 2018