బీపీఆర్ విఠల్ మృతి పట్ల వినోద్ సంతాపం..‌

305
b vinod kumar
- Advertisement -

ప్రముఖ ఆర్థికవేత్త బీ.పీ.ఆర్. విఠల్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక, ప్రణాళికా శాఖల కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా విఠల్ అందించిన సేవలు మరువలేనిది అని వినోద్ కుమార్ అన్నారు. విఠల్ మృతి తెలంగాణకు తీరని లోటు అని ఆయన అన్నారు.

ఆరు దశాబ్దాల క్రితంలోనే ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని వెలుగెత్తి చాటిన ఘనుడు బీపీఆర్ విఠల్ అని, ఉమ్మడి రాష్ట్రం ఆంద్రప్రదేశ్‌లోనే తెలంగాణ సర్ ప్లస్.. ఏ కేస్ స్టడీ.. అంటూ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను తెలుపుతూ విఠల్ పుస్తకాన్ని రాశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ( సెస్ ) స్థాపించారని, కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలపై అధ్యయనం చేశారని, క్విట్ ఇండియా ఆందోళనలో పాల్గొన్న ఘనత బీపీఆర్ విఠల్ కు దక్కిందని వినోద్ కుమార్ వివరించారు. బీపీఆర్ విఠల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -