ఎట్టకేలకు రిలీజవుతున్న గోపీచంద్ మూవీ

301
ARADUGULA BULLET MOVIE
- Advertisement -

యాక్ష‌న్ హీరో గోపిచంద్ న‌టించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌వుతుంది. గ‌త మూడు సంవత్స‌రాలుగా ఈమూవీ ‌విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈమూవీని విడుద‌ల చేయ‌నున్నారు నిర్మాత‌లు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లు బంద్ కావడంతో కొందరు తమ సినిమాలను వీటికి ఇచ్చేస్తూ ఆన్ లైన్ ద్వారా విడుదల చేసేస్తున్నారు. అలాగే ఆర‌డుగుల బుల్లెట్ మూవీని కూడా ఓటీటీలో విడుద‌ల చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ఈమూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

కాగా గోపిచంద్ స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టించింది. కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వ‌ల్ల ఈ చిత్రం విడుద‌ల రెండు సార్లు వాయిదా ప‌డింది. ఇప్పుడు ఓ ఓటీటీ సంస్ధ నుంచి మంచి ఆఫ‌ర్ రావ‌డంతో విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు చిత్ర‌యూనిట్. విడుద‌ల తేదీకి సంబంధించిన పూర్తి వివరాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపారు చిత్ర‌యూనిట్. కాగా గోపిచంద్ ఇటివ‌లే న‌టించిన చిత్రాలు వ‌రుస ప‌రాజ‌యాల‌య్యాయి. ఈమూవీ అయిన హిట్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -