‘వినయ విధేయ రామ’ ఫస్ట్‌లుక్‌..

315
- Advertisement -

టాలీవుడ్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ ‘రంగస్థలం’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్‌ బోయపాటి సినిమా చేసున్నాడగానే ఇక మాస్ రచ్చ స్టార్ట్ అని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ సినిమా మొదలు పెట్టి చాలా నెలలు అవుతున్న ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక వాళ్ళ వెయిటింగ్ పూర్తయింది. ఫైనల్ గా #RC12 ఫస్ట్ లుక్ దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేశారు నిర్మాతలు.

Vinaya Vidheya Rama

ఈ సినిమా ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో కైరా అద్వాని కథానాయికగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. బోయపాటి యాక్షన్ మార్క్‌కి ఏ మాత్రం తీసిపోకుండా, శత్రువులపై విరుచుకుపడుతూ చరణ్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ లుక్‌తో ఆయన అభిమానులను తెగ సంబరపడిపోతున్నారని చెప్పాలి. ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ఉదయం 10:25 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ప్రశాంత్ .. స్నేహ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.

- Advertisement -