మొక్కలు నాటిన వికారాబాద్ మున్సిపల్ కమిషనర్..

41

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారంకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మణికొండ మున్సిపల్ కమిషనర్ పాల్గొన కుమారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర గురువారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం గంగారాం రోడ్‌లో మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గారి కృషి ఎంతో తోడ్పడుతుంది అని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు.మొక్కలు నాటడమే కాదు వాటిని ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని, ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ గారిని అబినందించారు. ఈ ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని మరో ముగ్గురికి.. రామలింగం బోధన్, వెంకటయ్య దేవరకొండ, గ్యానేశ్వర్ తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్లకు ఛాలెంజ్ విసిరారు.ఈ కార్యక్రమంలో రాంకిషన్ డిప్యూటీ ఇంజనీర్, బీమా రాయుడు ఏఈ, నాగరాజు సానిటరీ ఇన్స్పెక్టర్, ఏసుదాసు హెల్త్ అసిస్టెంట్, మున్సిపల్ సిబ్బంది మరియు ప్రముఖులు పాల్గొన్నారు.