మెగా హీరో యాక్సిడెంట్‌పై రాములమ్మ స్పందన..

119

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు రాజకీయ నేతలు, టాలీవుడ్ పెద్దలు, సీనియర్, జూనియర్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు పెద్దలు నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి కూడా స్పందించారు. సాయిధరమ్ తేజ్‌తో తనకున్న అనుబంధాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

‘‘చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి, మరియు ఆర్టిస్ట్. సత్వరమే కోలుకోవాలని, విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…’’ అని విజయశాంతి తెలిపారు.

ఇక సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి అపోలో హాస్పటల్‌లోనే ఉండి తెలుసుకుంటున్నారని, ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. అవయవాలకు ఎటువంటి ఇబ్బంది లేదని.. నాడీ వ్యవస్థ బాగానే ఉందని అపోలో డాక్టర్ స్పష్టం చేశారు.