‘నొప్పిగా ఉంది’.. స్ఫృహలోకి వచ్చిన సాయి తేజ్‌..

114

శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా సాయిధరమ్‌తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన తాజాగా స్ఫృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో సాయితేజ్ కుటుంబ సభ్యులతో ఒకే ఒక్క మాట మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వీడియో కాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన సాయితేజ్ ‘నొప్పిగా ఉంది’ అని మాత్రమే మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సాయితేజ్ ఆ మాట తప్ప మరేం మాట్లాడలేదని, అసలు మాట్లాడే పరిస్థితిలో తేజ్ లేడని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే సాయితేజ్ దగ్గరకి కుటుంబ సభ్యులకు కూడా డాక్టర్లు అనుమతి ఇవ్వడం లేదని, కేవలం వీడియో కాల్ ద్వారానే సాయితేజ్‌ని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చూపిస్తున్నట్లుగా తాజాగా అందుతోన్న సమాచారం.

సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు తాజాగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. సాయిధరమ్‌ తేజ్‌కు అంతర్గత గాయాలు లేవని తెలిపారు. డాక్టర్‌ అలోక్‌ రజంన్‌ నేతృత్వంలో అందిస్తున్న చికిత్సకు ఆయన పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. కాలర్ బోన్ ఫ్యాక్చర్‌పై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.