చిరు…లూసిఫర్‌లో విజయశాంతి…!

131
chiru

మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు విజయశాంతి. ఈ సినిమాలో విజయశాంతి నటనకు మంచిమార్కులు పడటమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు.

తాజాగా మరోసినిమాకు రాములమ్మ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రైట్స్‌ను రామ్ చరణ్ సొంతం చేసుకోగా చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది.

దర్శకుడు సుజీత్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తుండగా సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరు సరసన విజయశాంతి నటిస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. టాలీవుడ్‌ హిట్ పెయిర్‌లలో చిరు-విజయశాంతి జోడి ఒకటి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో చిరుతో విజయశాంతి నటిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.