- Advertisement -
వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కి కీలక బాధ్యతలు అప్పగించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఆయన్ను ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈనియామకంతో విజయసాయి రెడ్డికి కేబినెట్ హోదా లభించింది. నిన్న సాయంత్రం నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.
ఇక నుంచి ఆయన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనుసంధాన కర్తలా వ్యవహరించనున్నారు. 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వం హయాంలో కంభంపాటి రామ్మోహన్ రావు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో సేవలు అందించారు. అయితే, 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఏపీలో అధికారం కోల్పోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
- Advertisement -