రాజకీయాల్లోకి మరో హీరో !

34
- Advertisement -

అవసరమైతే రాజకీయాల్లోకి వస్తా అన్నారు నారా రోహిత్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నారా రోహిత్, తిరిగి మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి ప్రస్తుతం ‘ప్రతినిధి 2’ సినిమా చేస్తున్నాడు. హీరోగా కొత్త సినిమాలను లైన్ లో పెడుతూనే, అటు రాజకీయ నాయకుడి గానూ తన టాలెంట్ చూపేందుకు సిద్ధమయ్యారని టాక్. ఆయన కుప్పంలో టీడీపీ ప్రచార కర్తగా కొత్త కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించి రీసెంట్ గా నారా రోహిత్ తన సన్నిహితులతో పాటు లోకల్ ప్రజలతోనూ సమావేశం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా స్పందించారట.

‘నాకు మా చంద్రబాబు పెద్దనాన్న గారంటే ఎంతో గౌరవం. ఆయనను చిన్నతనం నుంచి గమనిస్తున్నా. కచ్చితంగా ఆయన పేరుకు ఎలాంటి అగౌరవం కలగకుండా నడుచుకుంటాను. నేను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. ఈ గ్యాప్ లో నేను మరో జీవితాన్ని చూశాను. నారా ఫాన్స్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో, అభిమానిస్తున్నారో అర్ధమైంది. ఇన్నాళ్లు గ్యాప్ తీసుకుని వాళ్ళని నిరాశ పరిచినందుకు సారీ చెబుతున్నాను. ఇకపై మాత్రం వినోదం ఒక రేంజ్ లో నా నుండి వస్తుంది. అలాగే, అటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అని నారా రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఐతే, మీరు పూర్తిగా పాలిటిక్స్ లోకి రావొచ్చు కదా అడిగిన ప్రశ్నకు నారా రోహిత్ సమాధానమిస్తూ.. సొసైటీకి మంచి చేయాలనే ఆలోచన నాకు మొదటి నుంచి ఉంది. అది మా పెద్దనాన్న గారి నుంచి నాకు వచ్చింది. భవిష్యత్తులో అందుకోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటే వస్తాను. అలాగే ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నేను మా టీడీపీ పార్టీకే ఓటు వేయమని ఇప్పటి వరకు చెప్పలేదు. మా పార్టీ ఏం చేసింది ?, ప్రస్తుత పార్టీ ఏం చేస్తోంది ? అని గమనించి, తోటి వారితో చర్చించి ఓటు వేయమని కోరుతున్నా’ అంటూ నారా రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.

Also Read:చలికాలంలో ఆస్తమా.. జాగ్రత్త!

- Advertisement -