విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్‌ను ప్రారంభించిన సూపర్ స్టార్..

231
krishna
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కలిసి 1972లో శ్రీ విజయ కృష్ణ మూవీస్ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. మీనా, హేమా హేమీలు, అంతంకాదిది ఆరంభం వంటి సూపర్ హిట్ చిత్రాల ఈ బ్యానర్ నుండి వచ్చాయి. అదే సమయంలో విమర్శల ప్రసంశలు పొందిన చిత్రాలు ఎన్నో తీసి విజయ నిర్మల గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. స్టూడియోతో పాటు డబ్బింగ్ స్టూడియో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టూడియో, ఎడిట్ సూట్స్ మరియు ఔట్ డోర్ యూనిట్స్ ను స్థాపించారు.

శ్రీ విజయ కృష్జ బ్యానర్ స్థాపించి దాదాపు 50 ఏళ్ళు అవుతుంది. ఈ సంస్థను డాక్టర్ నరేష్, మరియు సూపర్ స్టార్ కృష్ణ మనవడు నవీన్ విజయ కృష్ణ కలిసి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్ పేరుతో’ రీ లాంచ్ చేశారు. ఈ కార్యాలయంను సూపర్ స్టార్ కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హీరో సుధీర్ బాబు ఛైర్మెన్ ఛాంబర్, కాన్ఫిరెన్స్ హాల్‌ను ప్రారంభించారు. ప్రియ సుధీర్ పాలు పొంగించారు.

విజయ నిర్మల తమ్ముళ్లు రవికుమార్, రామనాధ్ అడ్మిన్ మరియు రిసెప్షన్ బ్లాక్స్ ను ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ నవీన్ విజయ కృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ నరేష్ విజయ కృష్ణ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపారు. బంధువులు, స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -