మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన గీతవృత్తిదారులు..

61
minister srinivas goud

హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో నిజామాబాద్ కు చెందిన గీతా పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌రితో కలిసి ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను కలిసి దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గీతవృత్తిదారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత TFT లను మంజూరు చేసిందన్నారు. కరోనా సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛమైన కల్లును అమ్ముకుని ఆర్థికంగా లాభపడ్డామన్నారు. ఎక్సగ్రేషియాను అందచేయడం ద్వారా గీత వృత్తి దారుల కుటుంబాలకు ఆర్థికంగా సహకారం చేకూరిందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు.