చిరుకు జై కొట్టిన విజయ్!

29

మెగాస్టార్ చిరంజీవికి మద్దతుగా నిలిచారు హీరో విజయ్ దేవరకొండ. తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం తాను సీఎం జగన్‌ను కలిసి చర్చిస్తే తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారంటూ కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు GiveNewsNotViews అంటూ ఓ హ్యాగ్‌ ట్యాగ్‌ను చిరంజీవి పోస్టు చేశారు. చిరుకు మద్దతుగా లక్షలాదిమంది స్పందిస్తుండగా తాజాగా విజయ్ దేవరకొండ సైతం స్పందించారు. మై ఫుల్ సపోర్ట్ అంటూ చిరంజీవికి మద్దతుగా నిలిచాడు.