రామానుజ విగ్రహావిష్కరణకు ప్రధాని..

46
modi

హైదరాబాద్ చినజీయర్ స్వామి ముచ్చింతల్‌ ఆశ్రమంలో జరిగే రామానుజ విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరుకానున్నారు.ఈ విషయాన్ని వెల్లడించారు చినజీయర్ స్వామి. గోదా దేవి కల్యాణంలో పాల్గొన్న జీయర్ స్వామి…మీడియాతో మాట్లాడారు.

ఫిబ్రవరి 5న ఆశ్రమంలో జరిగే రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారని తెలిపారు. బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ప్రతిష్ట చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి 14న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తరుపున అన్ని పనులు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడినట్టు స్వామిజీ తెలిపారు.

144 యాగ శాలలలో గుండాలు నిర్మాణం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 2వ తేదీన వాస్తు శాంతి కార్యక్రమం, 3వ తేదీన ఉదయం అగ్ని మధనం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.