ప్రజాపంపిణి వ్యవస్ధలో అవినీతిని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. నిత్యావసర సరుకుల నాణ్యత విషయంలో రాజీపడకుండా చూడడానికి, పౌరసరాఫరాల శాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ చీఫ్‌గా కల్నల్ ఎం. సూర్యప్రకాశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కల్నల్ సూర్యప్రకాశ్ రేపు పౌరసరఫరాల శాఖలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు పనిచేయనున్నాయి. భారత సైన్యంలో 32ఏళ్లు వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. అవినీతి నిర్మూలనలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం బలోపేతం చేస్తున్నారు. కల్నల్ శ్రీ ఎం. సూర్యప్రకాశ్ 1977 సెప్టెంబర్ లో భారతీయ సైన్యంలో చేరారు. మూడు దశాబ్దాల కాలంలో ఆయన లడ్డాక్, బారాముల్లా, జమ్ము కాశ్మీర్ లోని వివిధ సెక్టార్లలో పనిచేశారు.