ఆకట్టుకుంటున్న’దేవ్’ ట్రైలర్‌..

265
- Advertisement -

తమిళ హీరో కార్తి న‌టిస్తున్న తాజా చిత్రం దేవ్. ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. దేవ్ ఫ‌స్ట్ లుక్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను ర‌జ‌త్ ర‌విశంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఖాకీ లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత కార్తి స‌ర‌స‌న రెండోసారి ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు.

 Dev Movie

అయితే ఈ మూవీ ట్రైలర్‌ను ఈ రోజు హీరో సూర్య రిలీజ్‌ చేశారు. అడ్వెంచర్స్‌ ఇష్టపడే వ్యక్తి..ప్రేమలో పడటం.. ఫ్యామిలీ ఎమోషన్స్‌.. వీటన్నంటిలో అతనేం సాధించాడనే కథాంశంతో తెరకెక్కిన దేవ్‌.. ప్రస్తుతం టీజర్‌తో ఆకట్టుకుంటోంది. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హారిష్‌ జయరాజ్‌ సంగీతాన్ని సమకూర్చారు. రజత్‌ రవిశంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -