‘ఆట గ‌దరా శివ` సాంగ్ రిలీజ్ చేసిన విక్ట‌రీ వెంక‌టేశ్‌

309
venkatesh
- Advertisement -

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్దార్ధ తెరకెక్కించిన చిత్రం ఆట‌గ‌ద‌రా శివ‌. ఈసినిమాలో జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ హైప‌ర్ ఆది ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇటివ‌లే విడుద‌లైన ఈసినిమా ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. హైపర్ ఆది అదిరొపోయే డైలాగ్ లు ట్రైల‌ర్ లో అంద‌రిని అల‌రిస్తోన్నాయి. ప‌వ‌ర్ , లింగా, బ‌జ‌రంగీ భాయిజాన్ వంటి సినిమాల‌కు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించిన రాక్ లైన్ వెంక‌టేశ్‌ ఈసినిమాను నిర్మించారు. ఉద‌య్ శంక‌ర్ ఈసినిమాలో హీరోగా న‌టించాడు.

Venkatesh Launches Atagadara Shiva movie Song

ఈసంద‌ర్భంగా ఈసినిమాలో రామ రామ రే..సాంగ్ ను విక్ట‌రీ వెంక‌టేశ్ విడుద‌ల చేశారు. మంచి ఎమోష‌నల్ కంటెంట్ తో సినిమాల‌ను తీసే ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్దార్ద్ అన్నారు విక్ట‌రీ వెంక‌టేశ్. ఈసినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కొరుకుంటున్నాన‌ని తెలిపారు. చిత్ర నిర్మాత‌ల‌కు మంచి ప్రాఫిట్ రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుటుంన్నాన‌ని తెలిపారు. అలాగే చిత్ర‌బృందం మొత్తానికి అభినంద‌న‌లు తెలిపారు.

atagadara shiva

ఇక చిత్ర ద‌ర్శ‌కుడు చంద్ర సిద్దార్ద్ మాట్లాడుతూ ఉరి తీసే వ్య‌క్తి..ఉరి శిక్ష‌కు గురైన మ‌రో వ్య‌క్తి క‌లిసే చేసే ప్ర‌యాణంలో ఎదుర్కోనే ప‌రిస్ధితుల‌ను ఈసినిమాలో చూపించామన్నారు. ఈచిత్రం సాధార‌ణ జీవితంకు ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌న్నారు. క‌న్న‌డ‌లో విజ‌య సాధించిన రామ రామ‌రే చిత్రాన్ని ఆధారంగా తీసుకుని ఈసినిమాను తెర‌కెక్కించామ‌న్నారు. ఈసినిమాలో ప్రేక్ష‌కులు కొత్త ర‌కాన్ని చూస్తార‌న్నారు. ఇటివ‌లే విడుద‌లైన ఈ చిత్రం ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌స్తోంద‌న్నారు. జులై 14న ఈమూవీని విడుద‌ల చేస్తోన్న‌ట్లు తెలిపారు ద‌ర్శ‌కుడు చంద్ర సిద్దార్ధ్.

- Advertisement -