సచిన్ కొత్త ఛాలెంజ్.. సవాల్ ఎవరికంటే..?

132
Sachin Tendulkar

ఒక ఛాలెంజ్ మరవకముందే మరో ఛాలెంచ్ కి శ్రీకారం చుడుతున్నారు సెలబ్రిటీలు, రాజకీయనాకులు. గతంలో ఐస్ బకెట్, రైస్ బకెట్ ఛాలెంజ్ లు ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రీడలమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ‘హామ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్ విసరగా.. ఇందులో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు పాల్గొని ఒకరికి ఒకరు సవాల్ విసురుకున్నారు. ఇప్పుడు మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ‘కిట్ అప్’ అనే మరో ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టారు.

తాను ఇప్పుడు విసురుతున్న ఛాలెంజ్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ విసిరిన ఛాలెంజ్ కి కొనసాగింపుగా ఉంటుందని చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టమని, అందులో క్రికెట్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. తనకు ఇష్టమైన క్రికెట్ ఆట ఆడిన వీడియోని షేర్ చేస్తున్నానని, అలాగే మీకు ఇష్టమైన ఆట ఆడి, వీడియోను మీరు షేర్ చేయండి అంటూ క్రీడాకారులు విరాట్ కోహ్లీ, పీవీ సింధు, మిథాలీరాజ్, సర్ధార్ సింగ్, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్ లకు సవాల్ విసిరారు. అందరూ ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నాట్లు ఈ వీడియోలో పేర్కొంటూ ఇన్ స్ట్రాగ్రామ్  లో పోస్టు చేశాడు.