జనవరి 5న ‘ఆటగదరా శివ’ సంగీత విభావరి

539
Atagadara Shiva
- Advertisement -

ప్రముఖ నటుడు, రచయిత, కవి, దర్శకుడు తనికెళ్ల భరణి రాసిన ‘ఆటగదరా శివా’ గేయ కావ్యం సంగీత విభావరిగా సంగీతాభిమానుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. స్వతహాగా శివభక్తుడైన తనికెళ్ల భరణి రాసిన శివతత్త్వాలు అనేకం ఇప్పటికే జనంలోకి వెళ్లాయి. సంగీత దర్శకుడు, ప్రఖ్యాత వేణుగాన విధ్వాంసుడు ఫ్లూట్ నాగరాజ్ ఈ ‘ఆటగదరా శివ’ తత్వాలకు సంగీత దర్శకత్వం అందించనున్నారు.

. ఇవామ్, తెలంగాణ కల్చరల్ అండ్ టూరిజం మినిస్ట్రీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అలేఖ్య హోమ్స్ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమానికి శ్రీమతి మణినాగరాజ్ రూపకల్పన చేయగా, హీరో సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. విశ్వవిఖ్యాత డ్రమ్మర్ శివమణి, గిటార్ వాద్యకారిణి మోహినీ డే పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నైబృందం వాద్య సహకారం అందిస్తుంది. జంట నగరాలకు చెందిన గాయకులు ఈ పాటలు పాడనున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

- Advertisement -