విక్టరీ వెంకటేష్ @35..

261
- Advertisement -

వెంకటేష్ దగ్గుబాటి టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. తండ్రి రామానాయుడు అండతో సినీరంగంలో తొలిఅడుగులు వేసి.. తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈ శనివారంతో వెంకటేశ్ హీరోగా 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 1986 ఆగష్టు 14న రిలీజైన ‘కలియుగ పాండవులు’ మూవీతో హీరోగా తెరంగేట్రం చేశారు. 35 యేళ్ల సినీ ప్రస్థానంలో ఏడు నంది అవార్డులు.. 6 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు వెంకీ.

కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అప్పటి నుంచి ఇటీవల విడుదలైన నారప్ప.. రాబోయే ఎఫ్ 3 వరకు వెంకటేష్ నట ప్రస్థానం కొనసాగిస్తున్నారు. విక్టరీ వెంకటేష్‌ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్‌తో…తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న్నారు. అందుకే ఆయన విక్టరీ హీరోగా నిలిచారు.

వెంకటేష్ కెరీర్‌‌‌లో టాప్ సినిమాలు ఇవే..

కలియుగ పాండవులు, శ్రీనివాస కళ్యాణం, ప్రేమ, బొబ్బిలి రాజా, శత్రువు, క్షణ క్షణం, చంటీ, సుందరకాండ, ధర్మ చక్రం, సాహసవీరుడు సాగరకన్య, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం,పెళ్లి చేసుకుందాం,సూర్యవంశం,గణేష్,ప్రేమంటే ఇదేరా,రాజా,కలిసుందాం రా,జయం మనదేరా,నువ్వు నాకు నచ్చావ్,వసంతం,మల్లీశ్వరి,సంక్రాంతి,లక్ష్మీ,ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,తులసి,సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు,దృశ్యం,ఎఫ్ 2,వెంకీ మామ,నారప్ప, ప్రస్తుతం ఎఫ్ 3 మూవీతో పలకరించనున్నాడు వెంకటేష్

- Advertisement -