దసరా బరిలో చిరు-బాలయ్య..!

74
Chiru and Balayya

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ రూపొందింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇటీవలే పూర్తైంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో చిరూ సరసన నాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. దసరా .. దీపావళి .. సంక్రాంతికి విడుదల తేదీలను కొన్ని సినిమాలు ఫిక్స్ చేసుకోవడంతో, ‘ఆచార్య’ విడుదల ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ‘అఖండ’ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదలపై కూడా స్పష్టత లేదు. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే షూటింగును పూర్తిచేసుకోనుంది. కానీ సంక్రాంతి వరకూ ఎక్కడా ఖాళీ లేకపోవడంతో, ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు చిత్రాల విడుదలపై ఓ వార్త వినిపిస్తోంది. అక్టోబర్ 8 వ తేదీన ‘అఖండ’ను అక్టోబర్ 13వ తేదీన ‘ఆచార్య’ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.