సంక్రాంతి పండగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను.ప్రకృతితో మనిషి సహజీవనం చేసే అసలైన పండగ ఇది. ఆరుగాలం శ్రమించి మనకు తిండి పెట్టే అన్నదాతను గుర్తు చేసుకోవాల్సిన పండగ ఈ సంక్రాంతి అన్నారు.
భోగిమంటలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, పల్లెసీమలు, గంగిరెద్దులు, హరిదాసులు, ధాన్యపు రాశులు, పశువులకు అలంకరణలు ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగే సంక్రాంతి.మీ కష్టనష్టాలు భోగి మంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుంచి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రసరించాలని కోరుకుంటూ.. మన పెద్దలు పూర్వీకులను స్మరించుకుంటూ వారు చూపిన సన్మార్గంలో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. దేశ ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.