పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈప్రచారంపై పవన్ సన్నిహితులు మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. పింక్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమాలు చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్. బాలీవుడ్ భారీ విజయాన్ని సాధించిన పింక్ సినిమాను తెలుగు రిమేక్ చేయనున్నారు దిల్ రాజు. ఇందుకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ ను ఒప్పించారట.
ఈమూవీకి ఎంసీఏ మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చిత్రం జనవరి 20న సెట్స్ పైకి వెళ్ళనుందట. ఈసినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 25రోజులు మాత్రమే డేట్లు ఇచ్చాడట. ఫిబ్రవరిలో పవన్ ఈసినిమా షూటింగ్ లో పాల్గోననున్నాడని తెలుస్తుంది. ఇక ఈమూవీలో పవన్ సరసన హీరోయిన్ గా మొదట కైరా అద్వానిని సంప్రదించారట. అయితే ఆమె డేట్స్ కాస్త అటు ఇటుగా ఉండటం, పారితోషికం భారీగానే డిమాండ్ చేయడం జరిగిందట. అందువల్ల పూజా హెగ్డె ను సంప్రదిస్తున్నట్లు సమచారం. ఇటివలే పూజా హెగ్డె నటించిన సినిమాలు అన్ని భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. త్వరలోనే ఈవిషయంపై అధికారిక ప్రకటన చేయనుంది చిత్రయూనిట్.

