నాయిని సేవలు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

38
venkaiah-naidu

సోషలిస్టు ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయిని నర్సింహారెడ్డి అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కార్మిక సమస్యల పరిష్కారానికి చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

స్నేహశీలి నాయిని నర్సింహారెడ్డి పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన…వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇద్దరం దాదాపుగా ఒకే సమయంలో అసెంబ్లీలో అడుగుపెట్టాం.అప్పటినుంచి వారితో సాన్నిహిత్యం ఉందన్నారు వెంకయ్య.