ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా!

163
bigg boss 7 week

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 7వ వారంలో ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో అభిజిత్,అరియానా,అవినాష్,మోనాల్,నోయల్,దివి ఉన్నారు.

ఇక 7వ వారం 1,46,448 మంది ఓటింగ్‌లో పాల్గొనగా అభిజిత్ టాప్ పొజిషన్‌లో ఉండగా దివి లీస్ట్‌లో ఉంది. అభిజిత్ 32.88,అరియానా 18.12,అవినాష్ 14.10,మోనాల్ 13.27,నోయల్ 11.18,దివి 10.46 శాతం ఓట్లతో ఉన్నారు. ప్రతీ వారం లీస్ట్‌లో ఉన్న వారు ఎలిమినేట్ అవుతుండటంతో ఈ వారం దివి, నోయల్‌లో ఒకరు బయటకు రానున్నారు.

తొలి వారంలో సూర్య కిరణ్,రెండవ వారంలో కరాటే కల్యాణి,మూడవ వారంలో స్వాతి దీక్షిత్,నాలుగో వారంలో దేవి నాగవల్లి,5వ వారంలో అనారోగ్యంతో గంగవ్వ, సుజాత ,6వ వారంలో కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు.