‘ఆత్మ దర్శనం’ పుస్తకం ఆవిష్కరించిన వెంకటేశం ఐఏఎస్‌..

63
Burra Venkatesh IAS

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఐఏఎస్‌ శనివారం ప్రముఖ చిత్రకారులు (సాండ్ ఆర్టిస్ట్) కాంతిరిసా రచించిన ఆత్మ దర్శనం పుస్తకాన్ని హైదరాబాద్‌లో తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సైదా నాయక్, బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు, బీసీ శాఖ అధికారులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.