మంచు లక్ష్మీ కూతురుకు నోబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డు..

53
Vidya Nirvana Manchu

టాలీవుడ్‌ నటి లక్ష్మీ మంచు కూతురు విద్యా నిర్వాణ అరుదైన ఘనతను సాధించింది. విద్యా ‘యంగ్ చెస్ ట్రైనర్’ కావడం ద్వారా తన కుటుంబం గర్వించేలా చేసింది. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో విద్యా చోటు దక్కించుకుంది. విద్యా మోక్షం నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ చోకలింగం బాలాజీ సమక్షంలో పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.

విద్యా నిర్వాణ ఈ ఘనతను సాధించినందుకు మోహన్ బాబు .. లక్ష్మి మంచు సహా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మంచు లక్ష్మీ కూతురు కూడా వాళ్ల అమ్మలాగా చాలా తెలివైనదే. చిన్న వయసులోనే పెద్ద పెద్ద రికార్డులు కొట్టేస్తున్నది. అందరిచేత వండర్‌ కిడ్‌ అనిపించుకుంటున్నది.