ట్విట్టర్‌లో పొలిటికల్ పంచ్‌లు పేళుతున్నాయి. సందర్భం ఏదైన సరే.. ట్విట్ లకి..రీ ట్వీట్‌లు మొదలయ్యాయి. ఇటీవల జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేసుకుని ట్విట్లతో పంచ్‌లు వేశారు. దీంతో మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ ఈ ట్విట్ల బీజేపీ నుంచి కౌంటర్ ఎటాక్ వచ్చేసింది.
తెలుగు రాష్ట్రాల రైతులకు రుణమాఫీ వెసులుబాటు ఇవ్వకుండా వరాలన్నీ ఉత్తరాదికే ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల క్రితం ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. యూపీ ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూపీలో బీజేపీ ఘనవిజయం సాధించిన వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్‌సింగ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ అప్పు మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు.
దీనిపై మండిపడ్డ పవన్ కళ్యాణ్, కేంద్రం యూపీలో మాత్రమే రుణమాఫీ అమలు చేయడం తగదని అంటూ…దక్షిణాది రాష్ట్రాల రైతులను విస్మరించడం సరికాదని ఫైర్ అయ్యారు. అందులోను రైతుల ఆత్మహత్యలు ఎక్కువుగా జరుగుతున్న తెలుగు రాష్ట్రాల రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరాన్ని పవన్ గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల ప్రాంతీయ అసమానతలు కూడా వస్తాయని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే పవన్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు శనివారం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కౌంటర్ ఇచ్చారు. యూపీలో రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రాల ఆర్థిక వనరులను బట్టి ఆయా రాష్ట్రాలు రుణమాఫీపై నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు. ఇక రుణమాఫీ విషయంలో ఉత్తరాది, దక్షిణాది అన్న బేధాలు తీసుకు రావద్దని పరోక్షంగా పవన్‌కు చురకలంటించారు వెంకయ్య. మరి వెంకయ్య రీ కౌంటర్‌పై పవన్ నుంచి మళ్లీ ఎలాంటి రిప్లే ఉంటుందో చూడాలి.