బాలీవుడ్‌కు మెగా హీరో..!

115
varun tej

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగా హీరో వరుణ్ తేజ్‌. ప్రస్తుతం గని చిత్రంతో పాటు ఎఫ్‌ 3 చిత్రాలు చేస్తుండగా ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుండగా అంతలోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట వరుణ్.

అయితే అది టాలీవుడ్‌లో కాదు బాలీవుడ్‌లో. నూతన దర్శకుడు చెప్పిన కథకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుందని టాక్‌. కేవలం హిందీలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని కొందరంటుంటే, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి, ఆ తర్వాత ఇతర దక్షిణాది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా ఈ మూవీపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే.