బాహుబలి…ఏకైక ఆప్షన్‌..!

174
Varma Tweetson Baahubali
- Advertisement -

బాహుబ‌లి2 సినిమాపై ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్ల వ‌ర్షం ఇప్పుడు సునామీలా మారుతోంది. మరి బాహుబలి పై ఇంతలా వర్మ ఎందుకు ఫోకస్‌ పెట్టాడో తెలీదుగానీ..ప్రతి రోజూ తన ట్వీట్లలో ఖచ్చితంగా ‘బాహుబలి’ పేరు మార్మోగుతోంది.

అయితే..గత కొన్ని రోజులుగా బాహుబలిని, అందులో నటింనినవారిని పొగుడుతూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌లు చేస్తున్న వర్మ మరోసారి అదే పనిచేశాడు. నటులు కావాలన్న కోరికతో ఎంతో మంది ఫిలిం ఇన్స్టిట్యూట్ లలో చేరుతుండటం తెలిసిందే. ఇలాంటి వారందరికీ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సూచన చేశాడు. లక్షలు తగలేసి ఫిలిం ఇన్స్టిట్యూట్ లలో చేరడం శుద్ధ దండగ అని చెప్పాడు.

ఒక రూ. 200 ఖర్చు పెట్టి, రెండు గంటల సేపు ‘బాహుబలి-2’ సినిమా చూస్తే… 2వేల రెట్లు ఎక్కువగా నేర్చుకోవచ్చని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇదే సమయంలో ప్రఖ్యాతిగాంచిన పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్ కు కూడా వర్మ ఓ సూచన చేశాడు. ఇప్పటిదాకా మీరు నేర్పిస్తున్నదంతా పక్కన పడేసి… ‘బాహుబలి-2’ సినిమాను మాత్రమే ఏకైక కోర్సుగా అందించాలని సూచించాడు.

ట్విటర్‌ వేదికగా  భళ్లాలదేవుడిని వర్మ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ‘రానా దగ్గుబాటి.. తెరపై మీ నటన మహాద్భుతం. ఒకవేళ 20ఏళ్ల ముందు గనుక  ‘బాహుబలి 2’ వచ్చుంటే.. హాలీవుడ్‌ సూపర్‌ స్టార్లు ఆర్నాల్డ్‌ ష్క్వార్జ్‌ నెగ్గర్‌, సిల్వస్టర్‌ స్టాలోన్‌లు మీ ముందు పేలవంగా కన్పించేవారు’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

- Advertisement -