అవంతిక కోసం వెళ్లా…కానీ?

26
- Advertisement -

తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా చేసిన సినిమా బాహుబలి. జక్కన చెక్కిన ఈ సినిమాలో కనీసం ఒక్క ఫ్రేమ్‌లో నటించేందుకైన తహతహలాడిన నటీనటులెందరో ఉన్నారు. అలాంటి వారిలో రాశిఖన్నా ఒకరు. తాను బాహుబలిలో ఎందుకు నటించలేకపోయిందోనన్న విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాహుబలి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి నేనూ వచ్చాను.

అందులో తమన్నా పోషించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చాను. అయితే సుకుమారమైన ముఖం… చేతిలో కత్తి ఉండటాన్ని రాజమౌళి అస్సలు చూడలేకపోయారు. ఆ పాత్రకు అందంతో పాటు రఫ్‌లుక్ కూడా ఉండాలనేది రాజమౌళి యొక్క విజనరీ అని తెలిసింది. మళ్లీ అటువైపుగా వెళ్లలేదు. ఇటీవల వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటిస్తున్నారు. గతేడాది రుద్రలో అలరించగా తాజాగా ఫర్జీలో నటించారు. ప్రస్తుతం యోధ అనే సినిమాలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి…

దసరా…చమ్కీల అంగీలేసి సాంగ్

రామబాణం…భైరవిగా డింపుల్

బేబీమూన్‌ ట్రిప్‌..వీడియో వైరల్..!

- Advertisement -