ఆర్.జె. సినిమాస్ బేనర్‌పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వైశాఖం. జయ బి.దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ అయ్యాయి. వాటన్నింటినీ మించి ‘వైశాఖం’ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిన్న సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది…? దర్శకురాలు జయకు మరో హిట్ ఇచ్చిందా లేదా చూద్దాం…
కథ:
హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే వేణు(హరీశ్) తన అవసరాల కోసం అపార్ట్‌మెంట్‌లోని మిగిలిన వారిని వాడుకొంటుంటాడు. అదే సమయంలో ఆ అపార్ట్‌మెంట్‌లోకి భాను(అవంతిక) అనే అమ్మాయి దిగుతుంది. వేణు గర్ల్‌ఫ్రెండ్‌ని అని అబద్ధం చెప్పి ఫ్లాట్ తీసుకుని ఓ బ్యూటీపార్లర్ నడుపుతుంటుంది. విషయం తెలుసుకున్న వేణు.. పరువుపోతుందని, ప్రేమికుడిగా నటించేందుకు భానుతో ఓ ఒప్పందం చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. కానీ ఎప్పుడు గొడవలు పడే వీరి విడిపోతారు…తర్వాత ఏం జరుగుతుంది..? అసలు భాను అక్కడికి ఎందుకువచ్చింది..?చివరికి వీరిద్దరు కలిశారా..? లేదా అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ భావోద్వేగ సన్నివేశాలు, కథ, పాటలు. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్‌ల సంస్కృతి ఎలా ఉంటుందనే దానిపై తీసిన సినిమా ఇది. టామ్ అండ్ జెర్రీలాంటి రెండు పాత్రలు.. వారి మధ్య స్నేహం.. ప్రేమ.. గొడవలు.. విడిపోవడం వీటి మధ్య కథ సాగుతూ ఉంటుంది. తెరపై హీరో,హీరోయిన్ల జోడీ బాగుంది. సరదా, భావోద్వేగ సన్నివేశాల్లో హరీశ్ నటన బాగుంది. అవంతిక సైతం ఆకట్టుకుంది. సాయికుమార్‌ది చిన్న పాత్రే అయినా కథలో అదే కీలకం. పృథ్వీ, భద్రం, కాశీవిశ్వనాథ్ వాళ్ల పరిధి మేర నటించారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ సెకండాఫ్. దర్శకులు ఎంచుకున్నది చిన్న పాయింటే అయినా బలమైన సన్నివేశాలు, పాత్రలు ఉన్నప్పుడే అది విజయం సాధిస్తుంది. ఈ విషయంలో దర్శకురాలు మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. హీరో-హీరోయిన్ల లవ్‌ట్రాక్‌పై మరింత దృష్టి పెడితే బాగుండేది.
సాంకేతిక విభాగం :
సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. పాటలు బాగున్నాయి. కంట్రీ చిలుకా.. ప్రార్థిస్తా నచ్చుతాయి. ప్రేమకథే అయినా నిజజీవితానికి దగ్గరగా భావోద్వేగాలపై రాసుకొన్న కథ ఇది. ఫస్టాఫ్ అంతా అంతా సరదా సన్నివేశాలతో సాగుతుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
దర్శకురాలిగా అభిరుచి గల చిత్రాలను తెరకెక్కిస్తు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బి.జయ. ఆమె దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌లీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మరో సరికొత్త ప్రేమకథతో వైశాఖం అంటూ ముందుకొచ్చిన దర్శకురాలు మరోసారి ఆకట్టుకుందనే చెప్పాలి. మొత్తంగా ప్రేమ, ఎమోషన్‌ల మిలితమే వైశాఖం.
విడుదల తేదీ:21/07/2017
రేటింగ్ : 2.5/5
నటీనటులు: హరీశ్,అవంతిక మిశ్రా
సంగీతం: డీజే వసంత్
నిర్మాణం: బి.ఎ.రాజు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి. జయ