బిగ్‌ బాస్‌కి మళ్లీ నో చెప్పింది…

217
Anasuya Not Interested in NTR Big Boss Show
- Advertisement -

తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే భారీ రియాలిటీ షోగా ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ షో ఇటీవల ప్రారంభమైంది. 70 రోజుల పాటు జరగనున్న ఈ షోలో 14 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే వారిని కూడా ఎన్టీఆర్‌కు తగ్గట్లుగా సెలక్ట్ చేస్తారని భావించారు కానీ షో స్టార్ట్ అయ్యాక వచ్చిన పార్టిసిపెంట్లను చూశాక అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో  షోకి గ్లామర్ తెచ్చేందుకు అందాల భామ,యాంకర్‌ అనసూయను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తున్నారన్న వార్తలు వెలువడ్డాయి.  అయితే ఈ వార్తలను అనసూయ ఖండించింది. ‘‘బిగ్‌బాస్‌’ చేసేంత టైమ్‌ నాకు లేదు. ప్రస్తుతానికి సినిమాలు, టీవీ ప్రోగ్రామ్‌లతో చాలా బిజీగా ఉన్నాన’ని ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

తొలుతు షో ప్రారంభం ముందుకూడా అనసూయను 14 మంది పార్టిసిపేట్స్‌లో ఒకరిగా తీసుకొచ్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నించారట. కానీ వారి ఆఫర్‌ని అనసూయ తిరస్కరించదట. అంతేగాదు అందుకు గల కారణాలను సైతం వెల్లడించిందట. తాజాగా మరోసారి అనసూయ బిగ్ హౌస్‌లోకి వస్తుందని వార్తలు వెలువడ్డ అవన్ని పుకార్లేనని కొట్టిపారేసింది ఈ బ్యూటీ.

- Advertisement -