బీఏ రాజుతో అనుబంధం మరువలేనిది: చిరు

62
raju

ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బీఏ రాజు మృతిపట్ల పలువురు సంతాపం తెలపగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ఇండ‌స్ట్రీకి త‌లలో నాలుక లాంటి వ్యక్తి బీఏ రాజు లేర‌ని వార్త తెలిసి షాక్‌కు గుర‌య్యాను అని అన్నారు తెలిపారు చిరు.

మద్రాసులో ఉన్నప్పుడు సినీపరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని.. ఆన్ లొకేషన్ షూటింగ్ స్పాట్ లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారని పేర్కొన్నారు. నా చాలా సినిమాలకు ఆయన పీఆర్ వోగా పని చేశారు….కలెక్షన్స్ ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన అన్నారు. అలాంటి వ్య‌క్తి నేడు లేర‌ని తెలిసి షాక్‌కు గుర‌య్యాను. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు చిరు.

బీఏ రాజు… నువ్వు లేని తెలుగు సినిమా మీడియా మరియు పబ్లిసిటీ,ఎప్పటికీ లోటే… తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తెలిపారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.