తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పీసీసీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. హుజుర్ నగర్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల తర్వాత హుజుర్ నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉండటం వల్ల హుజుర్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటివలే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, బై ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ బలపడకపోవడంతో పీసీసీ చీఫ్ ను మార్చాలని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి నుంచి తప్పుకుంటానని చెప్పడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ మార్పు ఉండబోతుదన్నమాట. అయితే ఉత్తమ్ తర్వాత పగ్గాలు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి చాలా మంది నేతలు రేస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ఇలా పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి.