హాయినిచ్చే “నిస్పందభావాసనం”!

9
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలమంది పనిపైనే ఎక్కువ శ్రద్ద వహించి.. శరీరానికి విశ్రాంతి ఇవ్వడంపై నిర్లక్షం వహిస్తుంటారు. దాంతో శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల పలు అవయవాల పని తీరు మందగిస్తుంది. ముఖ్యంగా మెదడు చురుకుగా పని చేయదు. ప్రతి చిన్న పనికి అలసట అనిపిస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. నిద్రలేమి సమస్య వేధిస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు.. శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల చుట్టుముడతాయి. కాగా శరీరాన్ని రిలాక్స్ మోడ్ లోకి తీసుకెళ్లడానికి యోగా లోని ” నిస్పందభావాసనం ” ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల అన్నీ అవయవాలకు కూడా విశ్రాంతి లభిస్తుంది. తద్వారా మెదడు రీఫ్రెష్ అవుతుంది. ఇంకా మన ఆలోచన స్థాయి పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. అన్నీ అవయవాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అందుకే శరీరానికి విశ్రాంతినిచ్చే ” నిస్పందభావాసనం ” తప్పకుండా వేయాలని యోగా నిపుణులు చెబుతున్నారు.

నిస్పందభావాసనం వేయు విధానం

ముందుగా నేలపై లేదా యోగా షీట్ పై రిలాక్స్ మోడ్ లో కూర్చోవాలి. ఆ తరువాత కాళ్ళు ముందుకు చాపి, ఆ తరువాత చేతుల సహాయంతో శరీరాన్ని కొద్దిగా వెనుకకు వాల్చి, తలను కూడా ఫోటోలో చూపిన విధంగా వెనుకకు వాల్చాలి. తరువాత కళ్ళు మూసుకొని శ్వాస క్రియ నెమ్మదిగా జరిగించాలి. ఇలా చేసే క్రమంలో మనసును శ్వాస పైనే కేంద్రీకరించాలి. ఈ ఆసనాన్ని ఎంతసేపైన వేయవచ్చు. అయితే ప్రతిరోజూ వేసే యోగాసనాలు లేదా వ్యాయామం పూర్తయిన తరువాత ఈ నిస్పందభావాసనం వేస్తే చాలా మంచిది. ఈ ఆసనాన్ని ప్రతిరోజూ ఏ సమయంలోనైనా వేయవచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -