ఉగాది వేళ కాంతార అప్‌డేట్‌..!

21
- Advertisement -

కన్నడ సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రం విడుదలై భారీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌ విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈసినిమా సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని ఇప్పటికే ఓ అప్‌డేట్‌ ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ న్యూస్‌పై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

దేశప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ..కాంతార రెండో పార్టుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రకృతితో మన అనుబంధాన్ని ప్రతిబింబించే ఆకర్షణీయమైన కథనం కోసం రెడీ ఉన్నామని పేర్కొంది. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి అని ట్వీట్‌ చేశారు. ప్తమి గౌడ, కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌, నవీన్‌ డీ పడ్లి, ప్రమోద్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. మరి సీక్వెల్‌ పార్టులో భాగం అయ్యే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులెవరనే దానిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి…

జాతిరత్నాలు హీరోయిన్ తో నరేష్

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫస్ట్ సాంగ్

నాగ శౌర్య… ఇంట్రెస్టింగ్ టైటిల్

- Advertisement -