ట్రంప్-కిమ్‌…చారిత్రక భేటీ

230
trump kim
- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప సన్నివేశానికి వేదికైంది సింగపూర్‌. ఉప్పు,నిప్పులా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌లు భేటీ అయ్యారు. సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌ వీరి శిఖరాగ్ర సమావేశానికి వేదికైంది.

ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణకు ఒప్పించడమే ప్రధాన ఎజెండాగా వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు సహకరించాలని ట్రంప్‌.. కిమ్‌కు సూచించారు. ఇందుకు అంగీకరిస్తే.. ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని, దీనితోపాటు ఆర్థిక సాయం అందిస్తానని ట్రంప్‌ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. మొదట ఏకాంత చర్చల అనంతరం ఇరుదేశాల దౌత్యనేతలతో అధ్యక్షులు సమావేశం అయ్యారు.

kim trump

ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ కలిసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చర్చల తరువాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

అమెరికాపై అణు బాంబులు వేస్తామన్న బెదిరింపులతో కిమ్, ఉత్తర కొరియాను నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ తమ పట్టుదల వీడి, చర్చలకు ముందుకు రావడంతో చర్చలకు మార్గం సుగుమమైంది.

- Advertisement -