- Advertisement -
రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వరంగల్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కాళోజీ కళా క్షేత్రాన్ని సందర్శించారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రూ.50 కోట్లతో నిర్మాణం జరుగుతున్న కాళోజీ కళా క్షేత్ర పనులను పరిశీలించారు. మరింత వేగంగా నిర్మాణ పనులను చేపట్టాలని ఇంజనీర్లను, అధికారులను ఆదేశించారు.
అనంతరం వరంగల్ హరిత హోటల్ లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ నగరానికి దశాబ్దాల చారిత్రాత్మక చరిత్ర ఉన్నదని దేశ మనుగడకు సంబంధించి అనేక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయన్నారు. వరంగల్ లోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రాంతాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
- Advertisement -