జమ్మి మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్త..

110
- Advertisement -

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని చందానగర్ లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గంగారం చెరువులో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. ఊరి ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడి కో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మరియు
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ , ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరైయ్యారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొని గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో, గంగారం చెరువులో రెండు 2 జమ్మి చెట్టు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. మానవ మనుగడకు మొక్కలే ప్రాణం.. హరిత తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. వాతవారణ సమత్యులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఊరికి జమ్మిచెట్టు, ప్రతి గుడికి జమ్మిచెట్టు నాటాలని రాజ్యసభ సభ్యులు జోగునపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుతో జమ్మి మొక్కను నాటామన్నారు. తదనంతరం జమ్మి చెట్టు ప్రాధాన్యతను తెలుపుతూ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా వృక్షంగా చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా, ఔషధంగా ఎంతో ప్రాధాన్యం గలది అన్నారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. దసరా నాడు సాయంత్రం పక్షులను చూడటానికి గుంపులు గుంపులుగా వెళతారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనాన్ని పెంచుతున్నారు. ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం అవుదాం. మొక్కలు నాటుదాం. మన పిల్లలకు నివాసయోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అప్పగిద్దాం. నగరంలోని 1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు మొక్కలు నాటాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, చందా నగర్ IVF ప్రెసిడెంట్ కోటేశ్వరరావు,చందా నగర్, గంగారం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ రాజు, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, జనరల్ సెక్రటరీ భగత్ కుమార్, ట్రెసరర్ గోపి, భుజంధర్, పబ్బ శ్రీనివాస్ గుప్త, పబ్బ మల్లేష్ గుప్త, కంచర్ల వెంకటేష్,శ్రవణ్ మరియు ఇతర అర్చకులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -