బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 104 హైలైట్స్

30
episode 104

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ముగియడానికి ఒక్కరోజు మాత్రమే మిగిలిఉంది. శుక్రవారంతో 104 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకోగా ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కుమార్ సాయి,గంగవ్వ,లాస్య,కరాటే కల్యాణి ఇంటి సభ్యులతో మాట్లాడి జోష్ నింపారు.

తొలుత ఇంటి సభ్యులకు టీ షర్స్ పంపిన బిగ్ బాస్.. ఒకరి టీషర్ట్‌పై ఒకరు తమకు నచ్చి మెసేజ్ రాయాలని చెప్పారు. హారిక…. అఖిల్ టీ షర్ట్‌పై నీ సోల్ మేట్ సో లక్కీ.. అని రాసింది. తర్వాత హౌస్‌లోకి సడన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది మోనాల్. మోనాల్ రాకను గుర్తుపట్టిన అఖిల్..పరుగెత్తుకు వెళ్లగా అఖిల్‌కి అద్దం వెనుక నుంచే గట్టిగా హగ్ చేసుకుని ముద్దులతో హీటెక్కించింది. ఇక అఖిల్ ఎప్పటిలాగే నీ అందం మెస్మరైజింగ్‌గా ఉంది.. షాక్ అయ్యా..మిస్ యూ సో మచ్ అన్నాడు అఖిల్. రాత్రి నిద్ర పట్టడం లేదని అఖిల్ తెలపగా మోనాల్ కూడా సేమ్ ఫీలింగ్ అని తెలిపింది.

తర్వాత కరాటే కళ్యాణి ఎంట్రీ ఇస్తూనే టాప్ కంటెస్టెంట్స్‌ని చూసి ఎమోషనల్ అయ్యింది. అరియానా నీకు బంగాళాదుంప కూర రెడీగా ఉంచా అని తెలపగా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ చెప్పింది అరియానా. తర్వాత ఎంట్రీ ఇచ్చిన లాస్యకు హారికపై కంప్లైంట్ చేశాడు అభిజిత్.

ఫన్నీ గేమ్స్‌తో ఇంటి సభ్యులను అలరించారు లాస్య,మోనాల్,కరాటే కల్యాణి. అఖిల్‌కి ఈ హౌస్‌లో ఎక్కువ హగ్‌లు లభించాయి’? అవునా కాదా? అని అడగడంతో ఇంటి సభ్యులంతా ఎస్ అన్నారు. దీంతో అఖిల్ తలపై నుంచి ఐస్ వాటర్ వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇక స్వాతి దీక్షిత్, కుమార్ సాయిలు స్కిట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కుమార్ సాయి నవ్వుతూనే పంచ్‌లు వేసేశాడు. ముఖ్యంగా అఖిల్‌పై పంచ్‌లు వేశాడు కుమార్ సాయి. బ్రదర్ నీకు నాకు రెండు రెండు దగ్గర పోలికలు ఉన్నాయి. నీకు ఇష్టమైనది…నాకు ఇష్టమైనది ఒక్కటే.. అది ఏంటో తెలుసా?? పులిహోర. నీకు ఇష్టం లేదని నాకు ఇష్టం లేనిది ఇంకోటి ఉంది అది ఏంటో తెలుసా? కరివేపాకు అని తెలిపి అఖిల్ పరువు తీశాడు. చివరలో గంగవ్వ ఎంట్రీ ఇవ్వగా ఇవాల్టీ ఎపిసోడ్‌లో నోయల్, జోర్దార్ సుజాత, దివి, మెహబూబ్, అవినాష్‌లు సందడి చేయబోతున్నారు.