అఖిల్-మోనాల్…సేమ్ ఫీలింగ్!

35
akhil

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగియడానికి మరో ఒక్కరోజు మాత్రమే ఉండగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరు విజేతగా నిలుస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఓటింగ్ ప్రారంభం కాగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇక బిగ్ బాస్ 104 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా హౌస్‌ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ ఇంటి సభ్యులతో మాట్లాడి సందడి చేశారు. తొలుత ఎంట్రీ మోనాల్ ఎంట్రీ ఇవ్వగానే అఖిల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అడ్డుగా అద్దాలు ఉన్న సంగతి మర్చిపోయి మోనాల్‌కి హగ్‌లు, కిస్‌లు ఇచ్చాడు. మూడు రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు అఖిల్.. ప్రతి రోజు 3-4 అవుతుంది అని మోనాల్ బాధను చెప్పుకోగా నువ్వు వెళ్లాక నాక్కూడా నిద్ర పట్టలేదు.. అసలు పడుకోలేదని తెలిపాడు.

అఖిల్‌ డ్రీమ్స్‌ అన్ని నెరవేరాలని కోరుతూ గాల్లోకి బెలూన్లను ఎగురవేసింది. బెలూన్లు గాల్లోకి ఎగరగానే అఖిలే నంబర్‌ వన్‌ అని మోనాల్‌ గట్టిగా అరిచింది. బయటకు వచ్చాక అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని సోహైల్‌ అనగా.. బయట కథ వేరే ఉందని, కలిసేందుకు టైమ్‌ కూడా దొరక్కట్లేదని మోనాల్‌ చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్‌కి హగ్‌ ఇచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.