- Advertisement -
పేదింటి బిడ్డకు పెద్దన్నలా చేయూత నందించారు అంతర్జాతీయ వైశ్య ఫేడరనేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఆర్ధిక ఇబ్బంది ఏ పేదింటి బిడ్డకూ అవరోధం కాకూడదని, వివాహ వేదికలో ముచ్చటగా మూడు ముళ్ళు వేయించుకునే సందర్భంలో ఏ చెల్లీ కంటతడి పెట్టకూడదని గత కొన్నేళ్లుగా ఉప్పల ఫౌండేషన్ తరపున సాయం చేస్తున్న శ్రీనివాస్ తాజాగా మరో కుటుంబానికి సాయం అందించారు.
తొర్రూరుకు చెందిన పేద వైశ్య కుటుంబానికి చెందిన ఇమ్మడి జ్యోతికి బంగారు మంగళ సూత్రం,వెండి మట్టెలు బహుకరించి ఆశీర్వదించారు. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన ధైర్యం చెప్పారు. పేద వారికి తనవంతుగా సాయం చేస్తున్న శ్రీనివాస్‌పై స్ధానికులు ప్రశంసలు గుప్పించారు.
- Advertisement -