ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన రైలు ప్రయాణం రష్యాలో ఉంది. మరీ సువిశాలమైన భారతదేశంలో అటువంటి రైలు ఉందా…ఠక్కున చేప్పలేము ఎందుకంటే మనకి కూడా పూర్తిగా తేలీదు. కానీ భారతీయ రైల్వేలో అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం చేసే రైలు ఉంది. ఇది అస్సాంలోని డిబ్రఘడ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు రైలు ప్రయాణం కొనసాగుతొంది. ఇది ఇప్పుడు ఈ విషయంపై ఎందుకింత చర్చ జరుగుతుందో తెలుసా…వందే భారత్ రైలు.
వందే భారత్ రైల్ రెండు ప్రధాన నగరాలను కలుపుతూ…అతి తక్కువ సమయంలో ప్రయాణించే వీలుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్‌ను 2011-12రైల్వే బడ్జెట్‌లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు. 2013నాటికి స్వామి వివేకానంద 150వ శత జయంతి సందర్భంగా జనవరి 12న ప్రారంభించారు. డిబ్రుఘడ్ నుంచి కన్యాకుమారి మధ్య ఉన్న 4,218 కిలోమీటర్ల దూరంను 80 గంటలు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
వివేక్ ఎక్స్‌ప్రెస్ దాదాపుగా 58రైల్వేస్టేషన్‌లో ఆగి…ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తుంది. ఈ రైలులో ఇంజిన్‌తో పాటు 3జనరల్ కోచ్‌లు, 11స్లీపర్ కోచ్‌లు, 4 త్రీటైర్ ఏసీ కోచ్‌లు, ఒక టూటైర్ ఏసీ కోచ్, ఒక ప్యాంట్రీ ఉండే ఈ రైలు అస్సాం, నాగాలాండ్, పశ్చిమబెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.
రష్యాలోని ట్రాన్స్ సైబీరియన్ ట్రైన్ సూమారుగా 9,250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పశ్మిమ రష్యాలోని మాస్కో నుంచి తూర్పు రష్యాలోని వ్లాడివోస్టాక్ నగరాన్నికి ఆరు రోజుల్లో చేరుకుంటుంది. ఇది దాదాపుగా మన వివేక్ ఎక్స్‌ప్రెస్‌కు రెట్టింపు దూరం ప్రయాణిస్తుందన్నమాట.
ఇవి కూడా చదవండి…