తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు

19
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ వేడుకలు భాగ్యనగరంలో ఘనంగా జరుగుతున్నాయి.

పాతబస్తీలోని మిరాలం ఈద్గా కు పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు జరుగకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. చార్మినార్ పరిసరాలో ట్రాఫిక్ ఆంక్షలు, పలు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.

ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఎక్కడ చూసిన సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ప్రవచనాలు ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ రోజు ప్రత్యేకంగా పేద ప్రజలకు దానధర్మాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని భావించి కొందరు ముస్లింలు పేదవారికి బట్టలు, బియ్యం దానం చేశారు. ప్రతి రోజు దానధర్మాలు చేయడం వల్ల తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని సంపూర్ణ దైవదర్శనం సిద్ధిస్తుందని ముస్లిం సోదరులు విశ్వసిస్తారు.

Also Read:జమ్మూ టూ శ్రీనగర్‌..వందే భారత్ రైలు

- Advertisement -