వాహనదారులకు గుడ్ న్యూస్. టోల్ రేట్లు తగ్గాయి. తగ్గిన టోల్ రేట్లు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాగా ఈ తగ్గిన ఛార్జీలు 2026 మార్చి 31 వరకు అమలులో ఉండనున్నాయి.
ఏఏ టోల్ ప్లాజాల టోల్ ఫీ తగ్గిందంటే తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద మొత్తంగా 3 టోల్‌ప్లాజాలు ఉన్నాయి.
పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, వ్యాన్‌లు, జీపులకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, తేలికపాటి కమర్షియల్ వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు.
చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే అతి తక్కువగా తగ్గించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ మూడు టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబరులో టోల్ ఫీజు వసూళ్లు ప్రారంభమయ్యాయి. 2024 జూన్ 31 వరకు జీఎమ్మార్ సంస్థ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది.
Also Read:ఉగాది రాశి ఫలాలు… 2025

