అన్నిరాష్ట్రాల మంత్రులతో కేంద్రమంత్రి హర్షవర్ధన్ సమావేశం..

17
harsha vardhan

ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైరన్, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, ముందస్తు జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది.

భార‌త్‌లో తొలి విడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందజేస్తామని తెలిపారు వైద్యశాఖ అధికారులు. తొలి విడ‌త‌లో కోటి మంది వైద్యారోగ్య సిబ్బందితో పాటు మ‌రో రెండు కోట్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఈ వ్యాక్సిన్ అందించ‌నున్న‌ట్లు తెలిపారు.