దేశంలో 24 గంటల్లో 20,346 కరోనా కేసులు..

61
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదుకాగా 222 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,95,278కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,28,083 కేసులు యాక్టివ్‌గా ఉండగా 1,00,16,859 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,50,336కి చేరింది.