బడ్జెట్ 2021: మంచినీటికి రూ.87 వేల కోట్లు కేటాయింపు..

128
- Advertisement -

2021-2022 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్‌ సభలో ఆమో మాట్లాడుతూ.. కొత్తగా 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని ‘జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌’ తీసుకురానున్నట్టు తెలిపారు. రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87 వేల కోట్లు కేటాయించామన్నారు. దేశంలో 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు మంచినీరు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు లక్షా 41 వేల 678 కోట్లు కేటాయించామన్నారు. రూ.87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఘనవ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్‌ అర్బన్‌ తీసుకురానున్నట్టు తెలిపారు. తుక్కు వాహనాల రద్దు, అధునాతన వాహనాల వినియోగం, 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు.

అలాగే ‌ఆర్థిక రంగ సేవ‌ల్లో కీల‌క‌మైన బీమా రంగ ప్ర‌యివేటీక‌ర‌ణ దిశ‌గా మ‌రో అడుగు ముందుకేశామన్నారు నిర్మల. బీమా సంస్థ‌ల్లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (ఎఫ్‌డీఐ) ప‌రిమితిని మ‌రింత పెంచేందుకు బీమా చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీమా రంగంలో నేరుగా 49 శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఎఫ్‌డీఐల‌ను అనుమ‌తించే వారు. ఆర్థిక రంగ పున‌రుత్తేజం కోసం ఈ ప‌రిమితిని 74 శాతానికి పెంచుతున్న‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మలా ప్ర‌క‌టించారు.

- Advertisement -